మహిళ అదృశ్యం కేసులో ట్విస్ట్..దారుణ హత్యగా తేలిన వైనం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి..భయంతో హత్య చేసినట్లు నిందితుడి అంగీకారం
తెలంగాణ హసన్‌పర్తి,సెప్టెంబర్ 11* హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది.సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం..హసన్‌పర్తి పరిధికి చెందిన తౌటం స్వప్న(40)మే 15 నుంచి కనిపించకుండా పోయింది.ఆమె తండ్రి అమంచ రాజేందర్ ఫిర్యాదు మేరకు మే 31న ఎస్‌ఐ బి. సుజిత్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో స్వప్నకు పరిచయమున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన వొద్దిరాజుల బసవరాజ్ (27)పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.స్వప్న తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు,వివాహానికి అంగీకరించకపోతే తమ ఫొటోలు,వీడియోలను బయటపెడతానని చెప్పడంతో బసవరాజ్ భయపడినట్లు...