సెప్టెంబర్ 15 నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్.బి రాజారెడ్డి
తెలంగాణ వరంగల్, సెప్టెంబర్ 11 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రాజా రెడ్డి తెలిపారు.శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు,సిబ్బంది,ఆప్తాల్మిక్ అధికారులు,డైస్ ఆప్టోమెట్రిస్టులతో కంటి పరీక్షల శిబిరాలపై సంసిద్ధత సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డా.రాజా రెడ్డి మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో ఐదు ఆర్‌బీఎస్‌కే బృందాలు,ఒక్కో బృందానికి ఆప్టోమెట్రిస్ట్ లేదా ఆప్తాల్మిక్ అధికారిని అనుసంధానం చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు.వారానికి 3–4 రోజులు శిబిరాలు నిర్వహించి,ప్రతి బృందం రోజుకు 300...