గురువుకు పూర్వ విద్యార్థుల ఘన సన్మానం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం గర్వకారణమని వెల్లడి*

తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 12 వరంగల్: వరంగల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన వందన హైస్కూల్ ప్రిన్సిపాల్ ఆడెపు విజయలక్ష్మి శ్యాంసుందర్‌ను ఆమె పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.1999–2000 విద్యాసంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు శుక్రవారం వందన హైస్కూల్‌లో ఆమెను కలిసి శాలువా,పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ..తాము నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడటానికి విజయలక్ష్మి శ్యాంసుందర్ అందించిన క్రమశిక్షణతో కూడిన విద్య, మార్గదర్శకత్వమే కారణమని కొనియాడారు.ఆమెకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు లభించడం తమకెంతో గర్వకారణమన్నారు.తమపై మమకారం చూపుతూ విద్యాబుద్ధులు నేర్పిన గురువును సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో 1999–2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ...