OBCలకు 58 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే! మేమెంతో మాకు అంత:: “ఎంతో జనాభా ఉంటే… అంతే వాటా కావాలి” — హనుమకొండ OBC సమావేశంలో నాయకుల డిమాండ్
హనుమకొండ: OBCలకు జనాభా దామాషా ప్రకారం 58 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ హనుమకొండలో OBC సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. “ఎంతో మంది ఉన్నామో… అంతే వాటా కావాలి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ మా హక్కు — సామాజిక న్యాయం మా డిమాండ్” అని సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ మాజీ స్పీకర్ OSD గడ్డం భాస్కర్ ,గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్, వేణు మాధవ్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు, హైకోర్టు అడ్వకేట్ రాచకొండ ప్రవీణ్ కుమార్, ముదిరాజ్ నాయకులు అశోక్, పడ్మాజ...