EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మత్స్యశాఖ సొసైటీలో కులబహిష్కరణ చేసిన కుల పెద్దమనిషి చిరుత విజయ్. చిరుత రాజేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Oct 2026, 12:52 PM | TELANGANA, వరంగల్
    మత్స్యశాఖ సొసైటీలో కులబహిష్కరణ చేసిన కుల పెద్దమనిషి చిరుత విజయ్. చిరుత రాజేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని మత్స్యశాఖ ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అన్నందుకు
    కులంలో పెద్దన్న పాత్ర వహించవలసిన వాళ్లే అవినీతికి పాల్పడుతూ సొంత స్వలాభం కోసం అన్నదమ్ముల కలిసి మెలిసి ఉండే కులంలో స్విచ్లు పెడుతున్నారు
    నూతన పెద్దమనుషుల నియామకం చేసుకున్న ఇంకో వర్గం
    కల్లెడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో అంతర్గత విభేదాలు పరాకాష్ఠకు చేరాయి. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థులను కుల బహిష్కరణ చేశారనే ఆరోపణలు,వివాదాల నేపథ్యంలో సొసైటీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు.
    ఈ పరిణామాల మధ్య ఒక వర్గం సభ్యులు బుధవారం ప్రత్యేకంగా సమావేశమై ప్రత్యామ్నాయంగా నూతన పెద్దమనుషులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
    బొట్టు పెద్దమనిషి చిరుత వీరయ్య.
    సారుకోల పెద్దమనిషి చిరుత శ్రీనివాస్.
    గంగపుత్ర ప్రతినిధి పూస చిన్న యాకయ్య.
    ఇక పై తమ గ్రూపు పరిధిలోని సొసైటీ కార్యక్రమాలు,నిర్ణయాలన్నీ ఈ నూతన పెద్దమనుషుల సమక్షంలోనే జరుగుతాయని సభ్యులు తెలిపారు