EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి 25 వేల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలం సంబంధించిన భూమి, బస్సు సౌకర్యం కల్పించాలి.* *తెలంగాణ రాష్ట్ర సహాయ కమిటీ సభ్యులు భాష పోయిన బోయిన రవీందర్

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Sep 2026, 08:29 PM | TELANGANA, వరంగల్
    ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి  25 వేల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలం సంబంధించిన భూమి, బస్సు సౌకర్యం కల్పించాలి.*  *తెలంగాణ రాష్ట్ర సహాయ కమిటీ  సభ్యులు భాష పోయిన బోయిన రవీందర్

    జన చరిత్ర న్యూస్,హసన్ పర్తి సెప్టెంబర్ 01
    : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆశయాల సాధన కొరకై రాష్ట్రంలోని ఉద్యమకారులందరూ రాష్ట్ర నలుమూలల నుండి వివిధ రకాలుగా పోరాటం చేసి వారి యొక్క సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం పైన గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తెలంగాణ ఉద్యమకారుల సమస్యల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వారికి కావలసిన సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా 25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం సంబంధించిన భూమి, బస్సు సౌకర్యం కార్పొరేట్ స్థాయిలో ఉద్యమకారుల కుటుంబ పిల్లలకు ఉన్నత విద్యలో అవకాశం కల్పించి వారి యొక్క సౌకర్యాలు మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహాయ కమిటీ సభ్యులు భాష పోయిన బోయిన రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్ర సురేందర్, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకట స్వామి గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కావేటి రవీందర్, ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి నక్క సుమన్, ఆరెల్లి యాదగిరి, తుమ్మనపెల్లి వీరన్న, మట్టి కుమారస్వామి పాల్గొన్నారు.