EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి సీషెల్స్ పార్లమెంటరీ బృందంతో భేటీ అయినా:ఎంపీ రవిచంద్ర

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 07:55 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి సీషెల్స్ పార్లమెంటరీ బృందంతో భేటీ అయినా:ఎంపీ రవిచంద్ర

    భారత్ లో పర్యటిస్తున్న సీషెల్స్ దేశ పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఉప రాష్ట్రపతి (రాజ్యసభ ఛైర్మన్)సీ.పీ.రాధాకృష్ణన్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న సీషెల్స్ మన భారత్ తో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉంది.ఆ దేశ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజారెల్ ఎర్నెస్టా నాయకత్వంలోని ప్రతినిధి బృందం తమ భారత పర్యటనలో భాగంగా పార్లమెంటును సందర్శించి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో సమావేశమయ్యారు.ఆయన ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా సీషెల్స్ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఉప రాష్ట్రపతి తేనీటి విందు ఏర్పాటు చేసి వారికి జ్ఞాపికలు ప్రదానం చేశారు.