EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోత్కూర్: ప్రశాంతంగా వినాయక చవితి నిర్వహించాలని: సిఐ

    Author
    Posted By Jitta mahaveer
    | 10 Sep 2026, 03:47 PM | తెలంగాణ, యాదాద్రి భువనగిరి
    మోత్కూర్: ప్రశాంతంగా వినాయక చవితి నిర్వహించాలని: సిఐ

    మోత్కూరు సెప్టెంబర్ 10 (జన చరిత్ర): ఈనెల 14న నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు ఏర్పాటు చేసే మండపాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే చోట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేలా ఏర్పాటు చేయవద్దన్నారు. విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఇసుక నీరు సిద్ధంగా ఉంచాలని సూచించారు. డీజే సౌండ్ బాక్స్ లకు అనుమతి లేదని మండపాల వద్ద నిరంతరం కమిటీ సభ్యులు ఉండాలని తెలిపారు.