EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్మశాన వాటిక దారి మూసివేతపై నిరసన

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 06:07 AM | TELANGANA, వరంగల్
    స్మశాన వాటిక దారి మూసివేతపై నిరసన

    తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 10
    వరంగల్: నర్సంపేట రోడ్డులోని వివేకానంద జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న హిందూ స్మశాన వాటికకు వెళ్లే డివైడర్‌ను మున్సిపల్ అధికారులు,ట్రాఫిక్ పోలీసులు మూసివేయడానికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ స్థానిక హిందూ ముక్తిస్తల్ సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.సంఘం ప్రధాన కార్యదర్శి గోరంటల రాజు,మాజీ కార్పొరేటర్ తత్తరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో స్థానికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..డివైడర్‌ను పూర్తిగా మూసివేస్తే అంతిమయాత్ర సమయంలో స్వర్గరథాలు స్మశాన వాటికకు చేరుకోవడానికి దూరం ప్రయాణించి తిరిగి రావాల్సి వస్తుందని,దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.వెంటనే మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.ధర్నా వద్దకు చేరుకున్న ఇంతేజార్‌గంజ్ ఎస్‌హెచ్‌ఓ సుకూర్‌కు కూడా తమ సమస్యను వివరించారు.ఎమ్మెల్సీ జోక్యంతో పరిష్కారం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య జోక్యం చేసుకుని పోలీసు,మున్సిపల్ అధికారులతో మాట్లాడారు.డివైడర్‌ను పూర్తిగా మూసివేయకుండా అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేసేలా అధికారులను ఒప్పించారు.దీంతో నిరసనకారులు ధర్నాను విరమించారు.సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పెనుమండ్ల లక్ష్మణ్, వంగరి భాస్కర్,శనిగరపు ప్రభాకర్,ఈగ శంకర్,కోమాకుల నాగరాజు,కిషన్,సుదర్శన్,హలీం తదితరులు పాల్గొన్నారు.