EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మిలాద్‌ సందర్భంగా రక్తదాన శిబిరం 100 మందికిపైగా స్వచ్ఛంద రక్తదానం..మానవత్వానికి ప్రతీకగా నిలిచిన కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 07:16 PM | TELANGANA, వరంగల్
    మిలాద్‌ సందర్భంగా రక్తదాన శిబిరం 100 మందికిపైగా స్వచ్ఛంద రక్తదానం..మానవత్వానికి ప్రతీకగా నిలిచిన కార్యక్రమం

    మతాన్ని మానవత్వంతో మేళవిస్తూ..ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచేలా హనుమకొండలో మిలాద్‌ రక్తదాన శిబిరం నిర్వహించారు.1501వ జష్నే విలాదత్‌ సందర్భంగా అంజుమన్‌-ఎ-హైదర్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో దర్గా హజ్రత్‌ అబ్దుల్‌ నబీషా సాహెబ్‌ ఖిబ్లా వద్ద శుక్రవారం 6వ మిలాద్‌ రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యువతతోపాటు పలువురు రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.100 మందికిపైగా రక్తదానం చేయగా,రెడ్‌క్రాస్‌ సొసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.సేకరించిన రక్తం నిరుపేద థలసేమియా,క్యాన్సర్‌ బాధితులకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఉమర్‌ అలీషా ఖాద్రీ సజ్జాదా నషీన్‌,దర్గా అబ్దుల్‌ నబీషా పీఠాధిపతి సోదరుడు అన్వర్‌ అలీషా ఖాద్రీ కూడా రక్తదానం చేశారు.ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరమని,ఒకరు చేసే రక్తదానం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘మన రక్తం..మరొకరి ఊపిరి’ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఇమామ్‌ ఖాన్‌తోపాటు ముస్లిం యువత,భక్తులు తదితరులు పాల్గొన్నారు.