EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి పర్వతగిరి సర్పంచ్ శంకర్

    Author
    Posted By JANA CHARITRA
    | 12 Sep 2026, 12:20 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి పర్వతగిరి సర్పంచ్ శంకర్

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, బీఎల్‌ఓ శోభ ఆధ్వర్యంలో యువతకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.
    అర్హత కలిగిన యువతకు ఓటు నమోదు ప్రక్రియ, అవసరమైన వివరాలు, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ఓ యువకుడికి నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి అర్హుడైన యువత తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సర్పంచ్ చీదురు శంకర్ సూచించారు. యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.