EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా:ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు.

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Sep 2026, 01:07 PM | TELANGANA, వరంగల్
    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా:ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు.

    నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేయనున్నట్లు ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు రాష్ట అధ్యక్షుడు తిరుగమల్ల షాలెమ్ రాజు వెల్లడి చేశారు.బుధవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు పూర్తి చేసిన పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. పట్టబద్రుల సమస్యలపై తనకు ముందుగా అనుభవం ఉన్నందున పట్టబద్రుల సమస్యల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల హక్కుల కోసం పోరాడడానికి ప్రజా హక్కుల సాధన సమితి సంఘం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నది అని ఆయన అన్నారు.