EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ రెడ్ క్రాస్‌కు నిధులు, స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కొండా సురేఖకు వినతి

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Sep 2026, 03:06 PM | TELANGANA, వరంగల్
    వరంగల్ రెడ్ క్రాస్‌కు నిధులు, స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కొండా సురేఖకు వినతి

    వరంగల్: తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ గారిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకే అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

    వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు అవసరమైన నిధులు, స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే కొండా సురేఖ గారిని కోరారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ, తప్పకుండా నిధులు, స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

    ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజకుమార్, ట్రెజరర్ బొల్లం శివ, ఎంసీ సభ్యులు నాడెంశాంతి కుమార్, తోట సంపత్, కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, తిరుపతి రెడ్డి, మండల పరిషరాములు, చొప్పరి సోమయ్య, చేనేత వర్కింగ్ ప్రెసిడెంట్ , చిప్ప వెంకటేశ్వర్లు కుచన రాములు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి