EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ భూములను నిరుపేదలకు ఇవ్వాలి. తెలంగాణ అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Sep 2026, 04:45 PM | TELANGANA, వరంగల్
    ప్రభుత్వ భూములను నిరుపేదలకు ఇవ్వాలి.  తెలంగాణ అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు  జన్ను నరసయ్య

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువు కుంట ప్రాంతంలో ఉన్నటువంటి భూములను పరిరక్షించడంతోపాటు ప్రభుత్వ భూములను గుర్తించి నిరుపేదలైన వారికి ప్రభుత్వ భూమి ని పంచి ఇవ్వలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గోపనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం సర్పంచి నాంపల్లి విజయ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా తాసిల్దార్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూములను అందించి,వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇందుకు తాను సానుకూలంగా స్పందించి త్వరలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.