EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహాత్మా గాంధీజీకి ఘన నివాళి

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 03:55 PM | TELANGANA, వరంగల్
    మహాత్మా గాంధీజీకి ఘన నివాళి

    జాతిపిత మహాత్మా గాంధీజీ జన్మదినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ విధులు నిర్వహిస్తుందని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత,అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఏఆర్ & సివిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.

    ఇవి కూడా చదవండి