EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాజీపేటలో అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్ రూ.13,810 విలువైన మద్యం స్వాధీనం

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 03:59 PM | TELANGANA, వరంగల్
    కాజీపేటలో అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్  రూ.13,810 విలువైన మద్యం స్వాధీనం

    కాజీపేట, అక్టోబర్ 2:
    కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వడ్డెర బస్తీ, జూబ్లీ మార్కెట్ సమీపంలోని ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ బృందం దాడి నిర్వహించింది.

    ఈ దాడిలో వడ్డెర బస్తీకి చెందిన గుంజ శిరీష (30)ను అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ మొత్తం రూ.13,810గా పోలీసులు తెలిపారు.

    స్వాధీనం చేసుకున్న వాటిలో 180 మి.లీ. పరిమాణం గల రాయల్ స్టాగ్ 14 సీసాలు, 90 మి.లీ. పరిమాణం గల ఐబీ 20 సీసాలు, ఓసీ 27 సీసాలు, 180 మి.లీ. మాన్షన్ హౌస్ 10 సీసాలు, సిగ్నేచర్ 10 సీసాలు, వజ్రం 10 సీసాలు ఉన్నాయి.

    ఇవి కూడా చదవండి

    అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నిందితురాలిని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం కాజీపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

    ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.