EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాకాల చెరువులో యువకుడి మృతి

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 09:53 PM | TELANGANA, వరంగల్
    పాకాల చెరువులో యువకుడి మృతి

    పాకాల: మచ్చాపురం గ్రామానికి చెందిన బిల్లా సునీల్ పాకాల చెరువులో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెరువులో సునీల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
    సునీల్ చెరువులోకి ఎలా వెళ్లాడు? ప్రమాదవశాత్తు మృతి చెందాడా? లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల పూర్తి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.