EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మడికొండలో అక్రమంగా మద్యం విక్రయం.. రూ.33,380 విలువైన మద్యం స్వాధీనం

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Oct 2026, 10:28 AM | TELANGANA, వరంగల్
    మడికొండలో అక్రమంగా మద్యం విక్రయం.. రూ.33,380 విలువైన మద్యం స్వాధీనం

    మడికొండ, అక్టోబర్ 2:
    అనుమతులు, లైసెన్స్ లేకుండా అక్రమంగా మద్యం, బీర్లు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం మడికొండలో దాడి నిర్వహించారు. స్వామి క్యాంటీన్ ప్రధాన రహదారిలోని ఓ ప్రదేశంలో నిర్వహించిన ఈ దాడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న **పల్లపు శంకర్ (33)**ను అదుపులోకి తీసుకున్నారు.

    అతని వద్ద నుంచి రూ.33,380 విలువైన వివిధ రకాల మద్యం, బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మద్యం, నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం మడికొండ పోలీసులకు అప్పగించారు.

    ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్‌ఐ టి. వీరస్వామితో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి