EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *విద్యుత్ కోతలతో రైతుల నిరసన*

    Author
    Posted By Gade Krishna
    | 04 Oct 2026, 06:35 PM | TELANGANA
    *విద్యుత్ కోతలతో రైతుల నిరసన*

    *పంట పొలాలకు నీరు అందకపోవడంతో ఆందోళన చెందిన రైతులు*

    *రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులకు పట్టవా*

    జన చరిత్ర:
    మహబూబాబాద్ జిల్లా
    నెల్లికుదురు, ఆక్టోబర్ 04

    ఇవి కూడా చదవండి

    మహబూబాబాద్ జిల్లా
    నెల్లికుదురు మండలం
    ఎర్రబెల్లిగూడెం గ్రామంలో సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలతో ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు అన్నారు. తరచూ విద్యుత్ అంతరాయాలు,లో-వోల్టేజ్ సమస్యల కారణంగా గృహ వినియోగదారులతో పాటు రైతులు,చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
    విద్యుత్ సమస్యల కారణంగా వ్యవసాయ పనులు, త్రాగు నీటి సరఫరా, విద్యార్థుల చదువులు మరియు రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
    సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలోనీ విద్యుత్ సమస్యలను పరిశీలించి,అవసరమైన మరమ్మతులు చేపట్టి నిరంతర విద్యుత్ సరఫరా, లో-వోల్టేజ్ సమస్య పరిష్కారం, అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు/లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.