EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు ఆర్ఎంపి & పి.ఎం.పి నాయకుల ముఖ్య సమావేశo

    Author
    Posted By JANA CHARITRA
    | 04 Oct 2026, 06:52 PM | TELANGANA, వరంగల్
    ఏఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు ఆర్ఎంపి &  పి.ఎం.పి నాయకుల ముఖ్య సమావేశo

    గీసుకొండ మండలం ఉకల్ క్రాస్ లోని ఏఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు ఆర్ఎంపి & పి.ఎం.పి నాయకుల ముఖ్య సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా
    ఆర్.ఎం.పి & పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె రమేష్ ఆధ్వర్యంలో గీసుకొండ మండల అధ్యక్షుడు నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దేవులపల్లి రాజు ,ప్రధాన కార్యదర్శిగా పెంతల దిలీప్, ఉపాధ్యక్షులుగా వంగ యుగంధర్, కోశాధికారి గాదె చిరంజీవి, గౌరవ అధ్యక్షులుగా మంద రాజు, సంజీవ, కృష్ణమూర్తి నియమితులయ్యారు.ఈ నియామక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండేటి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి ముదిగొండ వెంకటేశ్వర్లు, కూరపాటి వీరస్వామి, మాజీ అధ్యక్షులు జూలూరి రాజు,తదితరులు పాల్గొన్నారు.