EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎట్టకేలకు అందుబాటులోకి త్రాగునీరు.

    Author
    Posted By AKULA MADHU
    | 07 Oct 2026, 09:41 AM |
    చౌటుప్పల్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎట్టకేలకు  అందుబాటులోకి త్రాగునీరు.

    చౌటుప్పల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐదు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు త్రాగునీరు అందుబాటులోకి వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి త్రాగునీటి కష్టాలతో సతమతమవుతున్న విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అసలే ఎండాకాలాన్ని తలపిస్తున్న ప్రస్తుత తరుణంలో నేటి వరకు విద్యార్థులు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.
    ఏది ఏమైనా నేడు త్రాగునీరు అందుబాటులోకి రావడంలో విద్యార్థులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమే గత కొన్ని రోజులుగా జన చరిత్ర న్యూస్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు నీరు అందుబాటులో వచ్చే వరకు పరిస్థితి ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే.