EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌కు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ అభినందనలు

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Oct 2026, 01:48 PM | TELANGANA, వరంగల్
    నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌కు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ అభినందనలు

    హనుమకొండ: నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ఆదర్శంగా నిలిచిన ఓ ఆటో డ్రైవర్‌ను హనుమకొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ అభినందించారు.

    ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన పట్టాదారు పాస్‌బుక్, బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం కార్డులను పొరపాటున ఆటోలోనే మరిచిపోయాడు. వాటిని గుర్తించిన ఆటో డ్రైవర్ వాటిని తన వద్ద ఉంచుకోకుండా నిజాయితీతో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

    వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ విచారణ చేపట్టి, ఆ వస్తువుల యజమానిని గుర్తించారు. అనంతరం సంబంధిత పత్రాలు, ఏటీఎం కార్డును యజమానికి తిరిగి అందజేశారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్‌ను ఇన్‌స్పెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి బాధ్యతాయుతమైన చర్యలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.