EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వడ్లకొండలో ఈ నెల 11 నుంచి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు. 15వ వార్షికోత్సవాలు ఎస్సై ప్రవీణ్ మరియు సొసైటీ చైర్మన్ లకు ఆహ్వాన పత్రిక అందజేత

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Oct 2026, 07:37 PM | Array
    వడ్లకొండలో ఈ నెల 11 నుంచి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు. 15వ వార్షికోత్సవాలు ఎస్సై ప్రవీణ్ మరియు సొసైటీ చైర్మన్ లకు ఆహ్వాన పత్రిక అందజేత

    జన చరిత్రన్యూస్
    పర్వతగిరి అక్టోబర్ 9,
    పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో స్నేహ జ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా శ్రీ దేవి నవరాత్రి మహోత్సవములు 15వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
    ఈ నేపథ్యంలో శుక్రవారం స్నేహ జ్యోతి యూత్ అసోసియేషన్ సభ్యులు పర్వతగిరి ఎస్సై బి. ప్రవీణ్ కుమార్‌తో పాటు పర్వతగిరి, చౌటపల్లి సొసైటీల చైర్మన్లను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందజేశారు.
    నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహ జ్యోతి యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.