EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *భద్రకాళి ఆలయం వద్ద మట్వాడ పోలీసుల అవగాహన* *దొంగతనాలు,సైబర్ మోసాలు,రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు సూచనలు

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Oct 2026, 07:44 PM | TELANGANA, వరంగల్
    *భద్రకాళి ఆలయం వద్ద మట్వాడ పోలీసుల అవగాహన*  *దొంగతనాలు,సైబర్ మోసాలు,రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు సూచనలు

    *తెలంగాణ వరంగల్ అక్టోబర్ 09*

    వరంగల్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో మట్వాడ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో భద్రకాళి ఆలయం వద్ద సమాజ భాగస్వామ్య పోలీసింగ్‌ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దొంగతనాల నివారణ,సైబర్‌ మోసాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఫ్లిప్‌కార్ట్,అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లు,లింకులు,సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు.వ్యక్తిగత,బ్యాంకు వివరాలు,రహస్య సంకేతాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ పండుగలను ప్రశాంతంగా,సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై శివకృష్ణ విజ్ఞప్తి చేశారు.