EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వక్ఫ్‌ భూములను రీ-సర్వే చేసి మైనార్టీలకు న్యాయం చేయాలి* *ఆక్రమణల నుంచి భూములను కాపాడాలి..ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు మహమ్మద్‌ అలీ

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Oct 2026, 11:44 AM | TELANGANA, వరంగల్
    వక్ఫ్‌ భూములను రీ-సర్వే చేసి మైనార్టీలకు న్యాయం చేయాలి*  *ఆక్రమణల నుంచి భూములను కాపాడాలి..ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు మహమ్మద్‌ అలీ

    తెలంగాణ/వరంగల్‌,అక్టోబర్‌ 17*

    వక్ఫ్‌ భూముల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హజ్రత్‌ బిక్కన్‌ దర్వేష్‌ ఉర్సు జాగీర్‌ దర్గా కమిటీ సభ్యుడు మహమ్మద్‌ అలీ డిమాండ్‌ చేశారు.ఖిలా వరంగల్‌ మండలం ఉర్సు జాగీర్‌ శివారులోని 273,274,275,276 సర్వే నంబర్లలో ఉన్న వక్ఫ్‌ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు.సంబంధిత భూములకు ప్రభుత్వం వెంటనే రీ-సర్వే నిర్వహించి,ఆక్రమణల నుంచి రక్షించాలని కోరారు.ఈ సందర్భంగా మహమ్మద్‌ అలీ మాట్లాడుతూ..కొత్తగా ప్రభుత్వ భూములు కేటాయించాలని తాము కోరడం లేదని,తమకు సంబంధించిన వక్ఫ్‌ భూములను గుర్తించి,వాటిని పరిరక్షించాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు.వక్ఫ్‌ ఆస్తుల రక్షణ మైనార్టీల హక్కుల పరిరక్షణతో ముడిపడి ఉందన్నారు.ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.మైనార్టీల ప్రయోజనాలను విస్మరించి,ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.మైనార్టీ సోదరులు ఈ అంశంపై స్పందించి,వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలని మహమ్మద్‌ అలీ పిలుపునిచ్చారు.ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించి,వక్ఫ్‌ భూములకు రక్షణ కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.