EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Oct 2026, 09:59 PM | TELANGANA, వరంగల్
    మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్

    మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్
    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలం
    జమాల్ పురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో ఇటీవల చనిపోయిన భైరబోయిన దూడమ్మ అనే వ్యక్తి కుటుంబాన్ని జమాల్ పురం గ్రామ సర్పంచ్ శ్రీ జున్ను కనుకయ్య యాదవ్ పరామర్శించారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.
    ఈ సందర్భంగా సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ గారు మాట్లాడుతూ. గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తాను మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
    బాధిత కుటుంబ సభ్యులు
    వనపూల, గంగరాజు, శ్రీనివాస్ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు సర్పంచ్ చేసిన సహాయాన్ని కొనియాడుతూ, నిజమైన ప్రజా నాయకుడు అని ప్రశంసించారు.
    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరబోయిన సదయ్య, పిడుగు రాంబాబు, గోదారి అనిల్, తదితరులు పాల్గొన్నారు.