EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏకశిలా నగర్‌లో ఘనంగా బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Oct 2026, 03:46 PM | TELANGANA, వరంగల్
    ఏకశిలా నగర్‌లో ఘనంగా బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం  ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఏకశిలా నగర్‌లో బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందాలని, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సంస్కృతి నిరంతరం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాస్, మండల అధ్యక్షులు బోరిగం నాగరాజు, సీనియర్ నాయకులు నారాయణరావు, ఉమేష్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, బొడ్రాయి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి