EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన క్వింటాల్ కు రూ.500 బోనస్ హామీని నెరవేర్చాలి కాంటాలు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని త్వరగా తరలించాలి - బీజేపీ నాయకులు పాలకూరి రవి గౌడ్

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Oct 2026, 07:53 PM | TELANGANA, నల్గొండ
    ఎన్నికల ముందు కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన క్వింటాల్ కు రూ.500 బోనస్ హామీని నెరవేర్చాలి  కాంటాలు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని త్వరగా తరలించాలి - బీజేపీ నాయకులు పాలకూరి రవి గౌడ్

    నల్గొండ: నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించిన సందర్భంగా బీజేపీ నాయకులు, యువ రైతు పాలకూరి రవి గౌడ్ రైతుల పక్షాన కలెక్టర్ గారికి పలు సూచనలు తెలియజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం, విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల పంటలు చాలావరకు ఎండిపోయాయని తెలిపారు. పండిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు దొడ్డు రకం ధాన్యాన్ని ఆర్జాలబావి కేంద్రానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

    రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి తాలు, పొల్లు, తేమ ఉన్నాయంటూ ఎలాంటి వంకలు, కొర్రీలు పెట్టకుండా వెంటనే కాంటాలు వేసి త్వరితగతిన తరలించేలా యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేయాలని కోరారు.

    ఇవి కూడా చదవండి

    అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ రోజు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉండటంతో రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, కాబట్టి ఆ హామీని నెరవేర్చాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ గారిని కోరారు.

    చివరగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.