EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి..మట్వాడ సీఐ కరుణాకర్‌రావు

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Oct 2026, 08:01 PM | TELANGANA, వరంగల్
    విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి  సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి..మట్వాడ సీఐ కరుణాకర్‌రావు

    విద్యార్థులు గంజాయి,డ్రగ్స్‌,ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని మట్వాడ సీఐ కరుణాకర్‌రావు సూచించారు.వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత,ఐపీఎస్‌ ఆదేశాల మేరకు సోమవారం పాపయ్యపేట చమన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాగృతి పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని,తల్లిదండ్రుల సూచనలు పాటిస్తూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని కోరారు.సైబర్‌ నేరాలు,ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ,డయల్‌ 112 అత్యవసర సేవలు,షీ టీమ్స్‌,బాల్యవివాహాలు,ఈవ్‌టీజింగ్‌,ర్యాగింగ్‌,మానవ అక్రమ రవాణా,భరోసా కేంద్రం సేవలు,మంచి స్పర్శ–చెడు స్పర్శ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ముఖ్యంగా బాలికలు సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని,అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.జాగృతి పోలీస్‌ కళాబృందం సభ్యులు సామాజిక సమస్యలపై ఆలపించిన పాటలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.అనంతరం విద్యార్థులు,పోలీసు సిబ్బంది కలిసి డ్రగ్స్‌ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మట్వాడ ఎస్‌ఐ శ్రీనివాస్‌,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు,కళాబృందం ఇన్‌చార్జి ఉమెన్‌ ఏఎస్‌ఐ నాగమణి,హెడ్‌ కానిస్టేబుళ్లు విలియమ్‌,వెంకటేశ్వర్లు,కానిస్టేబుల్‌ పూల్‌సింగ్‌,హోంగార్డులు విక్రమ్‌రాజు,చిరంజీవి,ఇతర పోలీసు సిబ్బంది, సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.