EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవాపూర్‌ మసీదు పనులు 22 రోజుల్లో పూర్తి అహ్మద్‌ బి.సాహిబా గ్రూప్‌ సహకారంతో అసంపూర్తి నిర్మాణానికి ముగింపు

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Oct 2026, 08:03 PM | TELANGANA, వరంగల్
    దేవాపూర్‌ మసీదు పనులు 22 రోజుల్లో పూర్తి అహ్మద్‌ బి.సాహిబా గ్రూప్‌ సహకారంతో అసంపూర్తి నిర్మాణానికి ముగింపు

    దేవాపూర్‌: ఆర్థిక ఇబ్బందులతో అసంపూర్తిగా నిలిచిపోయిన మసీదు నిర్మాణ పనులను అహ్మద్‌ బి.సాహిబా గ్రూప్‌ సహకారంతో కేవలం 22 రోజుల్లో పూర్తి చేశారు.మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మారుమూల దేవాపూర్‌ గ్రామంలో ఈ మసీదు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో భక్తులు కేవలం స్తంభాలు,పైకప్పు కిందనే ప్రార్థనలు చేసుకునేవారు.ఈ విషయం గ్రూప్‌ దృష్టికి రావడంతో ఖాదిమ్‌ ముహమ్మద్‌ మాసూమ్‌ అలీ సాహిబ్‌ గ్రామాన్ని సందర్శించి,మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసే బాధ్యతను స్వీకరించారు.గ్రూప్‌ నిర్మాణ వ్యయాలను భరించేందుకు ముందుకు రావడంతో మసీదు గోడలు,నేల,విద్యుత్‌ దీపాలు తదితర పనులను వేగంగా పూర్తి చేశారు.గ్రూప్‌కు చెందిన యువ సభ్యులు సైతం నిర్మాణ పనుల్లో శ్రమదానం చేస్తూ సహకరించారు.దీంతో మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిన నిర్మాణం పూర్తికావడంతో స్థానిక ముస్లిం భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అవసరమైన ప్రాంతాల్లో మసీదుల నిర్మాణానికి సహకరించడం,అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడం తమ లక్ష్యమని అహ్మద్‌ బి.సాహిబా గ్రూప్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.గతంలో ఓడోమ్‌ గ్రామంలోని మసీదు నిర్మాణాన్ని కూడా ఈ గ్రూప్‌ 89 రోజుల్లో పూర్తి చేసి,అహ్మద్‌ బి.సాహిబా జామియా మసీదును ప్రారంభించినట్లు తెలిపారు.ఇదే సేవా స్ఫూర్తితో దేవాపూర్‌ మసీదు నిర్మాణ పనులనూ పూర్తి చేసేందుకు సహకారం అందించారు.