EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా వరుణ యాగం

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Aug 2026, 07:56 AM | Bhakti, తెలంగాణ, నల్గొండ
    నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా వరుణ యాగం

    తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం మహా వరుణయాగాన్ని నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌.. దీనికి వేదిక అయింది. జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ వరుణయాగాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ తెల్లవారు జామున 4 గంటలకు నాగార్జున సాగర్‌ విజయ్‌ విహార్‌ టూరిజం గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో ఈ క్రతువు ఆరంభమైంది. అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది.రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే ఈ యాగం ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం యాగశాల ప్రాంగణంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 హోమగుండాలను ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 108 మంది ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అర్చకులు ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది.
    దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. ఈ యాగశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోన్నారు. వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ప్రధాన జలాశయం నాగార్జున సాగర్ వద్ద ఈ యాగం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, ప్రాజెక్టులన్నీ జలకళతో నిండాలని ప్రభుత్వం తలపెట్టిన ఈ పూజల్లో పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా వరుణ యాగం  - Additional Imageనాగార్జున సాగర్ లో వైభవోపేతంగా వరుణ యాగం  - Additional Image