EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రేమించిన యువతిని దారుణంగా హతమార్చిన ప్రియుడు

    ప్రేమించిన యువతిని దారుణంగా హతమార్చిన ప్రియుడు

    పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో విషాదకర ఘటన

    పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తనను ప్రేమించిన యువతి ఉద్యోగంలో చేరిన తర్వాత పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఓ యువకుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

    కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద హసీనా అనే యువతిని బాలసైదులు అనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు.

    ఇవి కూడా చదవండి

    పోలీసుల వివరాల ప్రకారం.. హసీనా, బాలసైదులు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే హసీనా ఉద్యోగంలో చేరిన తర్వాత తనను పట్టించుకోవడం లేదనే అనుమానం బాలసైదులులో పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    హసీనా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

    కేసు దర్యాప్తులో భాగంగా బాలసైదులును విచారించగా, తానే హసీనాను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.