EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అవయవ దానం అత్యున్నతమైన దానం-తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్

    అవయవ దానం అత్యున్నతమైన దానం-తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం  రాష్ట్ర సహాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్

    అన్ని దానాల్లోకెల్లా అవయవదానం అత్యున్నమైనదని, మానవ జన్మకు మహాదవకాశమని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి ఆధ్వర్యంలో గడియారం సెంటర్లోని పూలే విగ్రహం వద్దజరిగిన అవయవ దాన అవగాహన సదస్సులో డాక్టర్ అశోక్ పాల్గొని మాట్లాడుతూ నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగులు, అవయవ దానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షు ను, దేహ దానం ద్వారా భవిష్యత్తు వైద్యుల పరిశోధనలకు అంకితం కావచ్చునని తెలిపారు. మరణించిన తర్వాత కాల్చడం ద్వారా బూడిదగా, మట్టిలో పాతి పెట్టడం ద్వారా మట్టిగా మారిపోయే అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమందికి ప్రాణ ధారలుగా, చిరంజీవులుగా మిగిలిపోవచ్చునని అన్నారు. భారతదేశంలో సుమారు 18 లక్షల మంది అంధులు ఇప్పటికీ ప్రపంచాన్ని చూడలేక నేత్రదాతల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. బీసీ రాజ్యాధికార సమితి నాయకులు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అవయవ దాన కార్యక్రమాలను ఉదృతంగా ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నాగరాజు,వివిధ కుల సంఘాల బీసీ నాయకులు వరుసగా గద్దె వెంకట రామ నరసయ్య , గడ్డం దశరథం,మార్కాపురం సీతారాములు, నాగేశ్వరరావు, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు సూరిబాబు లతో పాటు జంపాల ప్రభాకర్, ఉమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారిచే అవయవ దాన ప్రతిజ్ఞ చేయించారు.