EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సమతా లొంగుబాటు

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Aug 2026, 11:43 AM | TELANGANA, వరంగల్
    మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సమతా లొంగుబాటు

    ములుగు: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమతా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లాలో పోలీసుల సమక్షంలో ఆమె లొంగుబాటు కార్యక్రమం జరిగింది.

    కాకరాల సమతా 1985లో మావోయిస్టు పార్టీలో చేరినట్లు పోలీసులు తెలిపారు. సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన ఆమె 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగినట్లు వెల్లడించారు.

    ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం కింద సమతాకు రూ.20 లక్షల రివార్డును అందించారు. లొంగిపోయిన అనంతరం ఆమెకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్న తెలంగాణకు చెందిన యాక్టివ్‌ కేడర్లు కూడా హింసాత్మక మార్గాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.

    సమతా లొంగుబాటుతో మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులకు మరింత కీలక సమాచారం అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.