EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఖర్గేకు అవమానంపై నిరసన.. హనుమకొండలో రేపు భారీ యాత్ర, సత్యాగ్రహం

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Aug 2026, 07:07 PM | Politics, TELANGANA, తాజా వార్తలు
    ఖర్గేకు అవమానంపై నిరసన.. హనుమకొండలో రేపు భారీ యాత్ర, సత్యాగ్రహం

    హనుమకొండ: హల్ద్వానీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన వివక్షపూరిత, అవమానకర చర్యను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) భారీ యాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నారు.
    సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ జంక్షన్ నుంచి యాత్ర ప్రారంభమై, పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహంతో ముగియనుంది.
    ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్టేట్ చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ హనుమకొండ చైర్మన్, డీసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహ రెడ్డి పిలుపునిచ్చారు.