EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలి -పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Aug 2026, 08:28 PM | Politics, TELANGANA, తెలంగాణ
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలి -పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్

    జన చరిత్ర/ఆత్మకూర్, వరంగల్

    వెనుకబాటుకు గురైన పరకాల నియోజకవర్గం ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి యువత ఘన స్వాగతం పలకాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16న పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు యువత ముందుండి యువజన సంఘాలను మహిళా సంఘాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభిమానులను తరలించాలని అన్నారు. ప్రభుత్వ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభను హాజరైన సభను విజయవంతం చేసేందుకు యువత శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వారి ఆదేశాల అనుసారం యువత ముందుండి సభకు వచ్చే ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుని సకల సౌకర్యాలు కల్పించాలని అన్నారు.ఈ యొక్క సమావేశంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు రేవూరి జయపాల్ రెడ్డి,వార్డు సభ్యులు బయ్యా కుమారస్వామి,ఏఎంసి డైరెక్టర్ కాడబోయిన రమేష్, నియోజకవర్గ బీసీ సెల్ కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజు, గ్రామ అధ్యక్షులు తాళ్ల కిరణ్, ఎలగొండ లింగమూర్తి,మాజీ సభ్యులు కాడబోయిన రవి, యూత్ నాయకులు కాడబోయిన రాజకుమార్, మహమ్మద్ కరీం, షరీఫ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి,మొగిలి,బయ్యా సురేష్,ఎలగొండ రాజు తదితరులు పాల్గొన్నారు.