EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భరోసా కేంద్రాన్ని సందర్శించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

    Author
    Posted By JANA CHARITRA
    | 14 Aug 2026, 03:18 PM | TELANGANA, తాజా వార్తలు, నల్గొండ
    భరోసా కేంద్రాన్ని సందర్శించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

    మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం.. బాధితులకు సత్వర న్యాయం, అండగా నిలవాలి” – ఎస్పీ

    నల్గొండలోని భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. కేంద్రం ద్వారా మహిళలు, బాలికలు, చిన్నారులకు అందుతున్న పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించారు.బాధితులకు సత్వర సహాయం అందిస్తూ, గోప్యత, గౌరవం, సానుభూతితో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో చైల్డ్ ఫ్రెండ్లీ విధానంలో విచారణ, కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
    ప్రతి కేసును సున్నితమైన అంశంగా పరిగణించి వెంటనే స్పందించాలని, సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు న్యాయం జరిగే వరకు సహకారం అందించాలని ఎస్పీ సూచించారు.మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్‌చార్జ్ ఎస్‌ఐ అమ్రీన్, ఎస్‌ఐ గౌస్, ఏఎస్‌ఐ అబేదా, శ్రీనివాస్, కోఆర్డినేటర్ నళిని, సిబ్బంది, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.