EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 04:54 PM | TELANGANA, తెలంగాణ
    తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

    వరంగల్: తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

    ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సాజిద్ పాషా మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుంచి ఫెడరేషన్ సభ్యులు ఒకే వేదికపై చేరడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఏ. మాజిద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్, రాష్ట్ర నాయకులు అహ్మద్ జిలానీ నాయకత్వంలో వరంగల్ జిల్లా కమిటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు జిల్లాల్లో ఫెడరేషన్ సభ్యులు అక్రిడిటేషన్ కమిటీల్లో సభ్యులుగా కొనసాగుతున్నారని, ఇది ఫెడరేషన్ సాధించిన ముఖ్య విజయమని పేర్కొన్నారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటే మరిన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హక్కులను సాధించుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

    ఇవి కూడా చదవండి

    ఫెడరేషన్ సలహాదారులు వహీద్ గుల్షన్, ఇస్మాయిల్ జాబి మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్నో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు పండుగ వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ, జర్నలిస్టు మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు మహమ్మద్ సాజిద్ పాషా, కోశాధికారి మహమ్మద్ అమీర్ ఖాన్, సలహాదారులు వహిద్ గుల్షన్, ఇస్మాల్ జాబి, జాయింట్ సెక్రెటరీ, ఫెరోస్ ఖాన్, రియాజుద్దీన్, ఆర్గనైజర్ సెక్రెటరీ యహీయా జబ్రీ, ఫెడరేషన్ సభ్యులు ఇక్బాల్ అలీ ,మహమ్మద్ బషీర్, మహమ్మద్ అంజత్, హనీఫ్ షరీఫ్, మహమ్మద్ రఫీ, ముస్తాక్ హుస్సేన్, ఇంకా జాఫర్, జావేద్, సర్వర్, తదితరులు పాల్గొన్నారు