EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్రికెట్ ప్లేయర్ విశ్వనాథ్ వైష్ణవ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు.

    క్రికెట్ ప్లేయర్ విశ్వనాథ్ వైష్ణవ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు.

    రంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతానికి చెందిన వరంగల్ వారియర్ క్రికెట్ ప్లేయర్ విశ్వనాథ్ వైష్ణవ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రావు పద్మ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు నేడు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా విశ్వనాథ్ వైష్ణవ్ కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వనాథ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.విశ్వనాథ్ వైష్ణవ్ మృతి కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్ అభిమానులు, స్థానిక క్రీడాకారులను విషాదంలోకి నెట్టిందని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.