EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంపీడీవోకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.* *మండల అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Aug 2026, 05:00 PM | Politics, TELANGANA, వరంగల్
    ఎంపీడీవోకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.*  *మండల అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి ఆగస్టు 16
    పర్వతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్ మండల ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి గ్రామాల నుండి తండాల నుండి ప్రజలు ప్రతి సోమవారం సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కోసమే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మండల పరిధిలోని గ్రామాల తండాల ప్రజల సమస్యలను సాల్వ్ చేసే విధంగా ప్రతి సోమవారం మండల కేంద్రంలోని ప్రజావాణి నిర్వహించి ఆయా గ్రామాల తండాల ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని మండల ప్రజలకు ఎంపీడీవో తెలుపుతూ, మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, అభ్యర్థనలను ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చునని తెలుపుతూ, ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యలను ఇక్కడికి ఇక్కడే పరిష్కార మార్గం చూపుతారని మండల ప్రజలకు ఎంపీడీవో తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తెలిపారు.