EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పరకాలలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Aug 2026, 06:33 PM | Politics, TELANGANA, తెలంగాణ, వరంగల్
    పరకాలలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

    పరకాల, ఆగస్టు 16: పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    శంకుస్థాపనలు
    రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం.
    రూ.82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు.
    రూ.65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం.
    రూ.45.15 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం.
    రూ.32.17 కోట్లతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం.
    రూ.10 కోట్లతో అక్కంపేటలో అభివృద్ధి ప్రణాళిక పనులు.
    రూ.5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు.
    ఆత్మకూర్‌లో టౌన్‌షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్.
    రూ.3 కోట్లతో పరకాలలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం.
    రూ.1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం.
    ప్రారంభోత్సవాలు
    పరకాలలో రూ.35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆత్మకూర్‌లో రూ.1 కోట్లతో నిర్మించిన అధునాతన SPM సెంటర్, పరకాలలో రూ.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభించారు.
    పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడంతో పరకాల నియోజకవర్గంలో మౌలిక వసతులు, విద్య, వైద్యం, విద్యుత్, రహదారుల రంగాల్లో మరింత అభివృద్ధికి మార్గం సుగమమైంది.