EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధర్వేశిపురంలో ఘనంగా 301 బోనాల సమర్పణ

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Aug 2026, 07:21 PM | TELANGANA, తెలంగాణ, నల్గొండ
    ధర్వేశిపురంలో ఘనంగా 301 బోనాల సమర్పణ

    నల్లగొండ జిల్లా ధర్వేశిపురం: శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారికి ఆదివారం (16-08-2026) ఘనంగా 301 బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,000 మంది కుమ్మరి కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివసత్తులు, పోతురాజులు, డోలు వాయిద్య బృందాల నడుమ భక్తిశ్రద్ధలతో మట్టికుండల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఇత్తడి, స్టీల్ బోనాల కంటే మట్టి కుండల్లో అమ్మవారికి బోనాలు సమర్పించడం శ్రేష్ఠమని ఈ కార్యక్రమం ద్వారా కుమ్మర్లు చాటి చెప్పారు. శ్రావణ మాసంలో గ్రామదేవతలకు మట్టి కుండల్లో బోనాలు సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు టి.కె. శ్రీనివాసు, కార్యదర్శి నాగపురి నాగేష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు ఎగిరిశెట్టి వీరన్న, నిమ్మలూరి శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షులు కంభంపాటి సత్యనారాయణ, ప్రముఖులు ఆకారం మల్లేశం తదితరులు హాజరయ్యారు.నల్లగొండ జిల్లా అధ్యక్షులు రాధారావు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి గంగాధరి వెంకటేశ్వర్లు, ఆరు నియోజకవర్గాల అధ్యక్షులు నిమ్మనగోటి శ్యాంప్రసాద్, ఎలీజాల వెంకన్న, సిలువేరు సత్తయ్య, నిమ్మనగోటి వెంకన్న, తోటపల్లి కిరణ్, జమ్మిచెట్టి వేణుగోపాల్, జిల్లా ప్రచార కార్యదర్శి కంచర్ల రాము పాల్గొన్నారు.

    అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాడూరి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్, కోశాధికారి తాడూరి ఆంజనేయులు, గుమ్మడవెల్లి రమేష్, జయశంకర్ భూపాల జిల్లా అధ్యక్షులు కొండపర్తి ఇస్తారి, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.బోనాల ఉత్సవ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి ఎగిరిశెట్టి అనిత, వైస్ చైర్‌పర్సన్ ఆమంచి అనిత, మాధవి, ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.కుమ్మర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలికుమ్మరి ముద్దుబిడ్డ ఆకారం మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామదేవతల వద్ద పూజారులుగా పనిచేస్తున్న కుమ్మర్లకు వంశపారంపర్యంగా జీవోలు తీసుకురావడానికి ప్రభుత్వం, సంబంధిత మంత్రులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో కుమ్మర్ల తలరాతలు మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం మాట్లాడుతూ కుమ్మర్లకు ప్రత్యేక జీవో జారీ చేయడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్‌కు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించి కుమ్మర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ప్రపంచవ్యాప్తంగా మానవాళిని క్యాన్సర్ వంటి వ్యాధులు, ప్లాస్టిక్ వినియోగం తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో మట్టి పాత్రల వినియోగం ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మట్టి పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని కులాలు, అన్ని పార్టీల నాయకులు, ప్రభుత్వం సహకరించాలని కోరారు.

    ఎగిరిశెట్టి అనితకు మహిళా జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యత
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది మహిళలు ఏకగ్రీవంగా శ్రీమతి ఎగిరిశెట్టి అనితను నల్లగొండ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.కార్యక్రమానికి హాజరైన కులస్తులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పాత్రికేయులు, పోలీసు శాఖకు జిల్లా ప్రచార కార్యదర్శి కంచర్ల రాము పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున నిర్వహించిన బోనాల కార్యక్రమం భక్తి, సాంస్కృతిక వైభవంతో విజయవంతంగా ముగిసింది.

    ఇవి కూడా చదవండి