EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ గిర్మాజిపేటలో నిర్లక్ష్యం.. తీగలపై వేలాడుతున్న చెట్ల కొమ్మలు.

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 11:40 AM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    వరంగల్ గిర్మాజిపేటలో నిర్లక్ష్యం.. తీగలపై వేలాడుతున్న చెట్ల కొమ్మలు.

    వరంగల్ నగరంలోని గిర్మాజిపేట ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెట్లను తొలగించిన తర్వాత మిగిలిపోయిన భారీ కొమ్మలు తీగల పై వేలాడుతూ కనిపిస్తున్నాయి.
    ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పిల్లలు, వాహనదారులు ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    చెట్ల కొమ్మలను తొలగించిన అధికారులు వాటిని పూర్తిగా తొలగించకుండా ఇలా ప్రమాదకరంగా వదిలేయడం ఎవరి నిర్లక్ష్యం? అవగాహన లోపమా? లేక సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
    ఇప్పటికే ప్రమాదకరంగా మారిన చెట్లను, కొమ్మలను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.
    గిర్మాజిపేటలో ప్రమాదకరంగా వేలాడుతున్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించి, ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
    రిపోర్ట్ :అమరేంద్ర చారి .