EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వేములపల్లి మండల కేంద్రంలోని NH 167 రోడ్ ఫ్లై ఓవర్ నిర్మించాలని కలెక్టర్ కు వినతి

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 01:43 PM | TELANGANA, తాజా వార్తలు, నల్గొండ
    వేములపల్లి మండల కేంద్రంలోని  NH 167  రోడ్ ఫ్లై ఓవర్ నిర్మించాలని కలెక్టర్ కు వినతి

    మిర్యాలగూడ నియోజక వర్గంలో వేములపల్లి మండల కేంద్రం అనుకోని పోతున్న NH 167 నార్కట్పల్లి నుండి అద్దంకి వెళ్తున్న రోడ్ ఫ్లై ఓవర్ లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరగడం అనేకమంది ప్రాణాలు కోల్పోయి విగత జీవితం అవుతున్నారని , ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, ప్రమాదాలు నుండి బయట పడాలంటే వేములపల్లి మండల కేంద్రంలో తక్షణమే సంబంధిత అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి, నిత్యం రాకపోకల సమస్యలను సమస్యల నిలయంగా ను, ప్రమాదాల నుండి సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాలనీ ఇట్టి విషయమై సోమవారం నాడు బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది.
    ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రావులపాటి రవిశంకర్ ,పార్లమెంటు ఇన్చార్జి పంటపాక యాదగిరి , బోనగిరి పార్లమెంటు ఇంచార్జి కత్తుల కాన్సిరాం , బొడ్డు కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు భాష పాక శివ ,జిల్లా ప్రధాన కార్యదర్శి మధు యాదవ్ , మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్ట దినేష , గాలిబు నలగొండ ఇంచార్జ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్,వంటపాక కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.