EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాల్య మిత్రుడి అనారోగ్యానికి అండగా నిలిచిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Aug 2026, 01:21 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    బాల్య మిత్రుడి అనారోగ్యానికి అండగా నిలిచిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి

    వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పి.. జిల్లా నాయకులు వీరగోని రాజ్ కుమార్ గారు, అల్లం మర్రెడ్డి గారి చేతుల మీదుగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేత
    మానవత్వమే తన సేవా మార్గంగా భావిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.*

    *గీసుగొండ గ్రామానికి చెందిన తన బాల్య మిత్రుడు వటుకుల మధుసూదన్ రెడ్డి (45) గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి వీడియో కాల్ ద్వారా మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, “మీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి చెప్పండి. అధైర్యపడవద్దు” అంటూ ధైర్యం చెప్పారు.*

    *అనంతరం మధుసూదన్ రెడ్డి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ మొత్తాన్ని జిల్లా నాయకులు, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి గారి చేతుల మీదుగా మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.*

    ఇవి కూడా చదవండి

    *ఈ సందర్భంగా అల్లం బాల కిషోర్ రెడ్డి చూపిన ఆప్యాయత, ఆర్థిక సహాయంపై మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఉన్న తన బాల్య మిత్రుడికి అండగా నిలిచి, ఆర్థిక సహాయంతో పాటు “నేను ఉన్నాను” అనే భరోసాను కల్పించడం మానవత్వానికి నిదర్శనమని పలువురు కొనియాడారు.*

    *ఈ కార్యక్రమంలో గీసుగొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మాజీ సర్పంచులు కోల కుమారస్వామి, దౌడు బాబు, మాజీ ఉపసర్పంచ్ పొగాకు బిక్షపతి, సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, ధోనికల రాములు, వీరగోని రామ్మూర్తి, ఎం.డి. ఖలీల్, బోయ అశోక్, తోట కమలాకర్, దౌడు రవి, చాపర్తి వరుణ్, కోట నర్సయ్య, దౌడు రాజేష్, దౌడు నర్సయ్య, ఇనుముల ప్రభాకర్, మేకల బాబు, మేకల యాకుబ్, చాపర్తి సుమంత్, యాదగిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.*

    *అలాగే మధుసూదన్ రెడ్డి మిత్రబృందానికి చెందిన పసుల శివన్నారాయణ, చాపర్తి రాజమౌళి, పాకనాటి సురేష్, పొగాకు రాజన్న, పొగాకు శ్రీకాంత్, సయ్యద్ ఇబ్రహీం, తాటికొండ కృష్ణమూర్తి, మేకల దయాకర్, మార్గం నాగేష్, వంగ శ్రీను, నేరెళ్ల వీరన్న, శివరాజ్యం రత్నాకర్, మహేందర్, బంకరాజు కృష్ణ ప్రసాద్, బాలరాజు, మూసుకు రమేష్ తదితరులు పాల్గొన్నారు.*