EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చల్లా ధర్మారెడ్డి హౌస్ అరెస్ట్..* *రేవంత్ రెడ్డికి భయమెందుకు?* *చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..*

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Aug 2026, 02:38 PM | TELANGANA, వరంగల్
    చల్లా ధర్మారెడ్డి హౌస్ అరెస్ట్..*   *రేవంత్ రెడ్డికి భయమెందుకు?*  *చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..*

    హనుమకొండ: నర్సంపేట బంద్ నేపథ్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నిర్బంధం.. ప్రభుత్వాన్ని నిలదీస్తే హౌస్ అరెస్ట్.. ఇదేనా కాంగ్రెస్ చెప్పుకునే ప్రజా పాలన? అని చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు.

    నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యమానికి మద్దతు తెలిపే నాయకులను పోలీసులు అడ్డుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.

    ఇవి కూడా చదవండి

    “విగ్రహం తొలగిస్తే చరిత్ర చెరిగిపోదు.. నాయకుడిని నిర్బంధిస్తే ప్రజల గొంతు మూగబోదు” అని చల్లా ధర్మారెడ్డి అన్నారు.

    ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం ద్వారా ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపేయలేరని స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి జరిగిన అవమానంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అణచివేయడం ఎవరి తరం కాదన్నారు.

    “నన్ను హౌస్ అరెస్ట్ చేయడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని హౌస్ అరెస్ట్ చేయడమే. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు.. గొంతు నొక్కి ప్రజల ఆగ్రహాన్ని అణచలేరు” అని చల్లా ధర్మారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన తప్పును సరిదిద్దుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని, అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.