EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అప్రజస్వామ్యంగా పోలీసులచే అక్రమ అరెస్టులు

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Aug 2026, 02:46 PM | TELANGANA, వరంగల్
    సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అప్రజస్వామ్యంగా పోలీసులచే అక్రమ అరెస్టులు

    ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అప్రజస్వామ్యంగా పోలీసులచే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆరోపించినారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ప్రజా పాలన కొనసాగిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతూ ప్రజల సమస్యలను తుంగలో తొక్కి రాష్ట్రంలో నిర్బంధకాండ కొనసాగిస్తున్నారన్నారు ఎవరైతే ప్రశ్నిస్తే వారిపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారన్నారు ఆసుపత్రిని సందర్శించి రోగుల బాగోగులు తెలుసుకోవడానికి మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు వెళ్తుంటే వారిని గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాను ప్రజలు ప్రశ్నించే హక్కు లేకుండా ఎమర్జెన్సీ ని తలపించే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి అకాల మరణం పొందిన నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహమును అర్ధరాత్రి తొలగించడం ప్రజాస్వామ్యక చర్య అని పేర్కొంటున్నాము బి ఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులను ప్రజా ప్రతినిధులను నాయకులను గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడం ప్రభుత్వ చేతకానికి నిదర్శనం అని పేర్కొంటున్నాను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ వైఖరిని విడనాడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోకుంటే ఆ ప్రజలే నీ సర్కార్కు చరమగీతం పాడతారనీ మరుపల్ల రవి అన్నారు