EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ డీఎస్పీ, డిండి సీఐ కార్యాలయాల్లో ఎస్పీ వార్షిక తనిఖీలు

    Author
    Posted By JANA CHARITRA
    | 20 Aug 2026, 07:17 PM | TELANGANA, నల్గొండ
    దేవరకొండ డీఎస్పీ, డిండి సీఐ కార్యాలయాల్లో ఎస్పీ వార్షిక తనిఖీలు

    కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలి.. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి – ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్
    నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా దేవరకొండ డీఎస్పీ కార్యాలయం, డిండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేశారు.
    ఈ సందర్భంగా కార్యాలయాల్లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు వివరాలు, పెండింగ్ కేసుల ఫైల్స్, క్రైమ్ రికార్డులు, పరిపాలనా రికార్డులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
    ప్రతి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉందో, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, నిందితుల అరెస్టు, చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాలను సమీక్షించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు వంటి తీవ్ర స్వభావం గల కేసుల దర్యాప్తుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని త్వరితగతిన ఛేదించాలని సూచించారు.సంఘటనా స్థలాల నుంచి లభించే ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి, పటిష్టమైన సాక్ష్యాధారాలను నమోదు చేయాలని ఎస్పీ తెలిపారు. కేవలం కేసును ఛేదించడం మాత్రమే కాకుండా, కోర్టులో నేరం రుజువయ్యే విధంగా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసుకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఆధునిక దర్యాప్తు పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశించారు.శాంతిభద్రతల పరిరక్షణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక, నేర ప్రభావిత, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి చట్టపరమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ వార్షిక తనిఖీలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డిండి సీఐ బిసన్నతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.