EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ట్రాఫిక్ రద్దీ నివారణకు ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటు

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Aug 2026, 04:55 PM | TELANGANA, వరంగల్
    ట్రాఫిక్ రద్దీ నివారణకు ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటు

    వరంగల్, ఆగస్టు 21: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ఎల్‌అండ్‌ఓ శ్రీ రాయల ప్రభాకర్, ఏసీపీ ట్రాఫిక్ శ్రీ టి. సత్యనారాయణ గారి పర్యవేక్షణలో, కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. వెంకన్న ఆధ్వర్యంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) సహకారంతో ఈ రోజు ఆదాలత్ జంక్షన్‌లో మూడు వైపులా, ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్‌లో ఒక వైపు మొత్తం 54 సిమెంట్ బ్లాక్‌లను ఏర్పాటు చేసి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చారు