EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్సీ సెల్ శ్రేణులు సమరశంఖం పూరించాలి ఆగస్టు 30న రాష్ట్ర ఎస్సీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటనను విజయవంతం చేయాలి - జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపు

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Aug 2026, 07:49 PM | TELANGANA, వరంగల్
    ఎస్సీ సెల్ శ్రేణులు సమరశంఖం పూరించాలి ఆగస్టు 30న రాష్ట్ర ఎస్సీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటనను విజయవంతం చేయాలి - జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపు

    వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ శ్రేణులు సమరశంఖం పూరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
    వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆదేశాల మేరకు శనివారం వరంగల్ కాశీబుగ్గలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం చిలువేరు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిధిలోని వివిధ మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, జిల్లా బాధ్యులు హాజరయ్యారు.
    సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జీలు పుల్యాల గాంధీ, నత్తి కోర్నేలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ గోవిందు శ్వేత హాజరై పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సంస్థాగత బలోపేతం, మండల స్థాయిలో ఎస్సీ సెల్‌ను మరింత క్రియాశీలంగా తీర్చిదిద్దడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
    ఈ సందర్భంగా ఆగస్టు 30న రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సహకారంతో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలో ఈ పర్యటన కొనసాగుతుందని తెలిపారు.
    హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ శ్రేణులను తరలించాలని చిలువేరు శ్రీనివాస్ సూచించారు. ప్రతి మండలంలో పార్టీ శ్రేణులను సమీకరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని, సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు.
    పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన కార్యక్రమాలను క్రమశిక్షణతో అమలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆయన అన్నారు.
    సమావేశంలో పాల్గొన్న వారు
    రాయపర్తి మండల అధ్యక్షుడు కందికట్ల యాకయ్య, సంగెం మండల అధ్యక్షుడు కట్ల నాగరాజు, గీసుకొండ మండల అధ్యక్షుడు కొమ్ముల వినయ్, నల్లబెల్లి మండల అధ్యక్షుడు పరికి పవన్, ఖానాపూర్ మండల అధ్యక్షుడు బత్తిని సునీల్, జిల్లా బాధ్యులు బూడిద రవి, గన్నారం యాకయ్య, చిర్ర మల్లయ్య, సదిరం సంజీవ్, పరికిస్వామి, మల్లెపాక సమ్మయ్య, బుగ్గ యుగంధర్, మంద అనిల్, గారే రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
    – పీఏ టు చిలువేరు శ్రీనివాస్
    వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్